
మొన్నటి వరకు స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ ..పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. దీంతో సుకుమార్ ఆయనకు ఐకాన్ స్టార్ అనే బిరుదు ఇచ్చాడు.బన్నీ చివరిగాఅల వైకుంఠపురములో చిత్రంతో పెద్ద హిట్ కొట్టాడు.ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులని బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా రికార్డులు క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యాడు.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా తెరకెక్కించనుండగా, తొలి పార్ట్‌ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు.పుష్ప2 పార్ట్ విడుదలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే పుష్ప తొలి పార్ట్ కాకినాడ పరిసరాలలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇది పూర్తయ్యాక బన్నీ.. ఐకాన్ సినిమా మొదలు పెట్టనున్నాడు. బోయపాటితో కూడా ఓ చిత్రం ఉంది.
ఈ రెండు చిత్రాలు పూర్తైన తర్వాత అల్లు అర్జున్ పుష్ప 2 పై దృష్టి పెట్టనున్నాడని ఇండస్ట్రీ టాక్. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేయనున్నాడు. వీరితో పాటు కొరటాల శివ, మురుగదాస్ దర్శకత్వంలోను బన్నీ సినిమాలు చేయనున్నట్టు తెలుస్తుంది. చూస్తుంటే 2025 వరకు బన్నీ కాల్షీట్ ఫుల్ బిజీ అనే చెప్పాలి.