Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అంటే అంతేమరి.. మరో అరుదైన ఫీట్
అగ్ర హీరో అల్లు అర్జున్ సోషల్‌మీడియాలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయన్ని అనుసరించే అభిమానుల సంఖ్య 25 మిలియన్లకు చేరింది.
Allu Arjun | అగ్ర హీరో అల్లు అర్జున్ సోషల్‌మీడియాలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయన్ని అనుసరించే అభిమానుల సంఖ్య 25 మిలియన్లకు చేరింది. ఈ స్థాయి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న తొలి దక్షిణాది నటుడిగా బన్నీ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారాయన. ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ముఖ్యంగా ఉత్తరాది మాస్ ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు.
ఈ సినిమాలోని నటనకుగాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుపొందడంతో బన్నీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. దీంతో సోషల్‌మీడియాలో ఆయన అభిమానగణం కూడా పెరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప-2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్..త్రివిక్రమ్ లేదా అట్లీ దర్శకత్వం సినిమా చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఆయన ఓ సినిమాకు అంగీకరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

