దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్‌బాబుతో గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ ఈ సినిమాపై మరింతగా అంచనాల్ని పెంచింది. భారతీయ పురాణాలతో ముడిపడిన ఈ సాహసగాథను హాలీవుడ్ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు రాజమౌళి.
ఈ సినిమా షూటింగ్ పూర్తికావడానికి మరో ఏడాది సమయం పట్టొచ్చని అంచనా. అయితే దీని తర్వాత రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటన్నది సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి తన తదుపరి సినిమాను అల్లు అర్జున్‌తో చేయబోతున్నారని టాక్ వినిపిస్తున్నది.
ఇందుకోసం రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారట. ట్రైబల్ నేపథ్యంలో సాగే కథాంశమిదని చెబుతున్నారు. అయితే నిజంగా ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చుతుందా? లేక ఇవన్నీ కేవలం పుకార్లేనా? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు బన్నీ. ముంబయిలో చిత్రీకరణ జరుగుతున్నది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తయ్యాకే బన్నీ నటించే తదుపరి సినిమాపై స్పష్టత వస్తుందంటున్నారు.