Allu Arjun | ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తన ప్రేయసి నయనికను ఈ ఏడాది మార్చిలో పెళ్లి చేసుకోనున్న శిరీష్, పెళ్లికి ముందే దుబాయ్‌లో గ్రాండ్‌గా ప్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించాడు. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులతో కలిసి జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మార్చిలో జరిగే వివాహానికి ముందు శిరీష్–నయనిక జంట దుబాయ్‌లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం ప్రత్యేకంగా ఈ పార్టీని ప్లాన్ చేశారు.
అల్లు అర్జున్ – స్నేహారెడ్డి దంపతులతో పాటు అల్లు కుటుంబం మొత్తం ఈ సంబరాల్లో పాల్గొంది. జే1 బీచ్ ప్రాంతంలో, సముద్రంలో ప్రయాణిస్తున్న బోటులో జరిగిన పార్టీ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పార్టీలో శిరీష్ షాంపైన్ బాటిల్ ఓపెన్ చేసి స్ప్రే చేయగా, చుట్టూ ఉన్న అతిథులంతా చప్పట్లతో హోరెత్తించారు. ఆ సమయంలో పక్కనే నిలబడ్డ అల్లు అర్జున్ నవ్వుతూ కనిపించాడు. శిరీష్, నయనిక ఇద్దరూ షాంపైన్‌ను షేర్ చేసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వీడియోలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీకి సంబంధించిన మరో హాట్ టాపిక్… అల్లు అర్జున్ ధరించిన షర్ట్. జే1 బీచ్‌లో తీసిన వీడియోలో స్నేహారెడ్డి వైట్ కలర్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించగా, అల్లు అర్జున్ మాత్రం వెర్సాస్ (Versace) ప్రింటెడ్ సిల్క్ ట్విల్ షర్ట్‌లో అదిరిపోయాడు.
ఆ బ్రాండ్ అధికారిక వెబ్సైట్ సమాచారం ప్రకారం, ఈ షర్ట్ ధర రూ.1,39,600 కావడం విశేషం. దీంతో అల్లు అర్జున్ లుక్ మరోసారి ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది.అల్లు శిరీష్ తన తాత, దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నయనికను వివాహమాడనున్నట్లు అక్టోబర్ 1, 2025న అధికారికంగా ప్రకటించాడు. ఈ జంట అక్టోబర్ 31, 2025న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. మార్చి 6, 2026న శిరీష్–నయనిక వివాహం జరగనుండగా, ఇదే రోజు అల్లు అర్జున్ – స్నేహారెడ్డి మ్యారేజ్ డే కావడం మరో విశేషం. ఇటీవల ట్రెండింగ్‌లో ఉన్న ఓ రీల్ ద్వారా ఈ పెళ్లి తేదీని శిరీష్ స్వయంగా వెల్లడించాడు.మొత్తానికి, అల్లు కుటుంబంలో మరో పెళ్లి వేడుకకు కౌంట్‌డౌన్ మొదలవ్వగా… దుబాయ్ ప్రీ వెడ్డింగ్ పార్టీతో సంబరాలకు ఇప్పటికే స్టార్ట్ పడిపోయింది.