అల్లు అర్జున్ – అట్లీ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చిన నాటి నుంచి ఈ సినిమా సెట్స్‌కి ఎప్పుడెప్పుడు వెళ్తుందా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ పానిండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఓ తాజా సమాచారం వెలుగు చూసింది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ని అట్లీ పూర్తి చేశారట. మాఫియా నేపథ్యంలో ఓ డాన్ చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ఇందులో బన్నీ పాత్రలో మూడు కోణాలుంటాయట.
పైగా ఈ సినిమాలో బన్నీ నెగెటివ్ షేడ్స్‌లో కనిపిస్తారని తెలుస్తున్నది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సిస్టర్ సెంటిమెంట్ ఈ కథలో బలంగా ఉంటుందట. ముఖ్యంగా బన్నీ అక్క పాత్ర చాలా ఎమోషనల్ టోన్‌లో సాగుతుందని తెలిసింది. ఆ పాత్రను ఓ సీనియర్ హీరోయిన్ పోషించనున్నదని టాక్ నడుస్తున్నది. అలాగే కథానుగుణంగా ఈ సినిమాలో కొన్ని గెస్ట్ రోల్స్ ఉన్నాయట. మరి ఆ రోల్స్ కోసం అట్లీ ఎవరెవర్ని అప్రోచ్ అవుతారో చూడాలి. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానున్నది.