Ugram | అల్లరి నరేశ్ ఉగ్రం ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్.. ఏ ప్లాట్ఫాంలోనంటే..?
Ugram | నాంది తర్వాత అల్లరి నరేశ్ (Allari Naresh), విజయ్ కనకమేడల (Vijaykanaka Medala) కాంబోలో వచ్చిన చిత్రం ఉగ్రం (Ugram). ఉగ్రం చిత్రాన్ని థియేటర్లలో మిస్సైన వారి కోసం సరికొత్త అప్డేట్ వచ్చింది.
Ugram | నాంది తర్వాత అల్లరి నరేశ్ (Allari Naresh), విజయ్ కనకమేడల (Vijaykanaka Medala) కాంబోలో వచ్చిన చిత్రం ఉగ్రం (Ugram). అల్లరి నరేశ్ డ్యుయల్ షేడ్స్‌లో ప్రేక్షకులు ఇదివరకెన్నడూ చూడని లుక్‌లో కనిపించి.. మంచి టాక్ అందుకున్నాడు. ఈ చిత్రంలో మలయాళ భామ మిర్నా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. కాగా ఉగ్రం చిత్రాన్ని థియేటర్లలో మిస్సైన వారి కోసం సరికొత్త అప్డేట్ వచ్చింది. ఉగ్రం ఓటీటీ రీలీజ్ అప్డేట్ వచ్చేసింది. ఉగ్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఉగ్రం చిత్రానికి టూమ్ వెంకట్, అబ్బూరి రవి స్టోరీ, డైలాగ్స్ అందించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది తెరకెక్కిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందించాడు. నాంది, ఉగ్రం తర్వాత విజయ్ కనకమేడల, అల్లరి నరేశ్ కాంబినేషన్లో మూడో సినిమా కూడా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు తమ ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత మరోసారి మూడో మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.
వరుస మిస్సింగ్ కేసులు నమోదు కావడం, వాటిని అల్లరి నరేశ్ పోలీసాఫీసర్‌గా ఎలా చేధించాడనే నేపథ్యంలో సాగే సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఎలాంటి స్పందన వస్తుందనేది తెలియాల్సి ఉంది. నరేశ్ మరోవైపు సభకు నమస్కారం సినిమాలో కూడా నటిస్తున్నాడు ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
a cop’s race against time to unmask the truth and save his family! ⚡️#UgramOnPrime, June 2 pic.twitter.com/Z9mLaU2HFZ
— prime video IN (@PrimeVideoIN) May 31, 2023
ఉగ్రం ట్రైలర్..
చాప్టర్-1 ఇంటెన్స్ నైట్ షూట్ మేకింగ్..
చాప్టర్- 2 పవర్ ఫుల్ ఫైట్ మేకింగ్..
ఉగ్రం టీజర్..
దేవేరి వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

