Allari Naresh Next Movie | ఎన్నో ఏళ్ల తర్వాత నాందితో హిట్టు కొట్టాడు అల్లరోడు. పైగా అది మాములు హిట్టు కాదు. అల్లరోడిని పది కోట్ల హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత వచ్చిన మారేడుమిల్లి కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినా.. ప్రశంసలు మాత్రం కాస్త గట్టిగానే అందుకున్నాడు. అల్లరి నరేష్ కథల ఎంపికలో చేంజెస్ కనిపిస్తున్నాయని అన్నారు. అనుకున్నట్లుగానే ఈ ఏడాది ఉగ్రంతో మరో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చాడు. అయితే అలాంటి కంటెంట్ ను మనం ఎన్నో సార్లు చూడటం, స్క్రీన్ ప్లే కూడా మరీ అంత క్రిస్పీగా ఉండకపోవడం, పైగా మితిమీరిన యాక్షన్ ఉండటంతో సినిమాను ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. ప్రస్తుతం అల్లరి నరేష్ సభకు నమస్కారం అనే కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.
ఇదిలా ఉంటే అల్లరినరేష్ కొత్త సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సారి అల్లరి నరేష్ పీరియాడిక్ కథను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా 1990 బ్యాక్ డ్రాప్ లో జరుగనుందట. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఫేమ్ సుబ్బు ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకంటుందట. వీలైనంత తర్వగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.