Allari Naresh | సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అల్లరి నరేష్ – ఆర్యన్ రాజేష్ 10 నిమిషాల్లో ఆస్తి రిజిస్ట్రేషన్
Allari Naresh |సినీ నటులు అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులపై గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఈ అన్నదమ్ములు కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే మొత్తం ప్రక్రియ ముగించుకోవడం విశేషంగా నిలిచింది.
Allari Naresh |సినీ నటులు అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులపై గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఈ అన్నదమ్ములు కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే మొత్తం ప్రక్రియ ముగించుకోవడం విశేషంగా నిలిచింది. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన వెంటనే సంబంధిత డాక్యుమెంట్లను అధికారుల నుంచి స్వీకరించిన వారు సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టే పరిస్థితుల్లో, తక్కువ సమయంలో పని పూర్తి కావడం అక్కడి సిబ్బంది సమర్థతకు నిదర్శనంగా నిలిచింది.
ఇటీవల భూముల కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి. విలువలు పెరగకముందే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు రావడంతో గత వారం రోజులుగా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాల్లో జనవరి 28 నుంచి 31 తేదీల మధ్య రెండు వేలకుపైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని సమాచారం. సాధారణ రోజుల్లో అన్ని కార్యాలయాలు కలిపి రోజుకు సుమారు 300 వరకే రిజిస్ట్రేషన్లు జరిగేవి. అయితే మార్కెట్ విలువలు పెరగనున్నాయన్న అంచనాలతో చివరి నాలుగు రోజుల్లో భారీగా లావాదేవీలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం 2022లో భూముల విలువలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. 2023లో కొన్ని ప్రాంతాల్లో 35 శాతం వరకు, మరికొన్ని చోట్ల 60 శాతం వరకు పెరుగుదల చోటుచేసుకుంది. తాజాగా ప్రస్తుత ప్రభుత్వం డిమాండ్, బహిరంగ మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరోసారి భూముల మార్కెట్ విలువలను సవరించడంతో ప్రజలు ముందస్తుగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు వెల్లడిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

