Allari Naresh | అల్లరి నరేష్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటైర్టెనర్ ‘బచ్చల మల్లి’. అమృతా అయ్యర్ కథానాయిక. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. డిసెంబర్ 20న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్ ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఈ సినిమాలోని రెండో పాటను శుక్రవారం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లాంచ్ చేశారు.
‘అదే నేను.. అసలు లేను.. తిరిగి జరిగిన జననమా.. ఎలా నిన్ను విడిచిపోనూ.. వెలుగు వెనకన నడవనా.. ’ అంటూ సాగే ఈ పాటను కృష్ణకాంత్ రాయగా, విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచారు. ఎస్పీ చరణ్, రమ్య బెహరా కలిసి ఈ పాటను ఆలపించారు. హీరోహీరోయిన్ల ప్రేమప్రయాణం నేపథ్యంలో ఈ పాట సాగింది. మొరటువాడైన హీరోని హీరోయిన్ ప్రేమ ఎలా మార్చిందో తెలిపేలా కృష్ణకాంత్ ఈ పాట రాశారు. ఈ పాటలో అల్లరి నరేష్, అమృత అయ్యర్ కెమిస్ట్రీ అద్భుతమని, విజువల్ వండర్ అనిపించేలా చిత్రీకరణ ఉంటుందని మేకర్స్ తెలిపారు. రోహిణి, రావురమేష్, బలగం జయరామ్, హరితేజ, వైవా హర్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ఎం నాథన్.