అల్లరి నరేశ్ కొత్త సినిమా శనివారం హైదరాబాద్‌లో మొదలైంది. ఫాంటసీ, కామెడీ కలగలుపుగా రూపొందుతున్న ఈ చిత్రానికి చంద్రమోహన్ దర్శకుడు. రాజేశ్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మాతలు. హాస్య మూవీస్ సంస్థతోపాటు ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడం విశేషం. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాగచైతన్య క్లాప్ ఇవ్వగా, అగ్ర దర్శకుడు బాబీ కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు వి.ఐ.ఆనంద్ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకులు వశిష్ట, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల స్క్రిప్ట్‌ని నిర్మాతలకు అందజేశారు.
హర్ష్‌కుమార్, సుప్రియ యార్లగడ్డ, అనిల్ సుంకర, జెమినీ కిరణ్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అతిథులంతా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ఇది నటుడిగా అల్లరి నరేష్ 65వ సినిమా అని, ఇందులో ఆయన పాత్ర సరికొత్తగా ఉంటుందని, కథ, కథనాలు కూడా కొత్తగా ఉంటాయని మేకర్స్ తెలిపారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో నరేశ్ వీకే, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, మురళీధర్‌గౌడ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రాంరెడ్డి, సంగీతం: చేతన్ భరద్వాజ్.