‘తొలి సినిమా చేస్తున్నప్పుడు ఎవరికైనా టెన్షన్ కామన్. మా దర్శకుడు నాని కాసరగడ్డకి ఇది ఫస్ట్ సినిమా. కానీ తనకి ఎక్కడా టెన్షన్ లేదు. అంత కాన్ఫిడెన్స్‌గా తానుండటానికి కారణం ఈ ప్రొడక్టే. సాంకేతికంగా అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్.. ఈ మూడు ఇందులో అద్భుతంగా ఉంటాయి. భీమ్స్ కసితో సంగీతాన్నందించారు. నటీనటులంతా సిన్సియర్‌గా కష్టపడ్డారు. ఇక ప్రొడ్యూసర్ చిట్టూరి శ్రీనుగారు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.
ఈ నెల 21న వస్తున్నాం. తప్పకుండా అంతా థియేటర్లలోనే చూడండి.’ అని అల్లరి నరేశ్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన ‘12A రైల్వే కాలనీ’ చిత్రం ఈనెల 21న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ అవెంట్లో అల్లరి నరేశ్ పై విధంగా స్పందించారు.
అతిథులుగా విచ్చేసిన దర్శకులు హరీశ్‌శంకర్, విఐ ఆనంద్, విజయ్ కనకమేడల చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. చిత్ర దర్శకుడు నాని కాసరగడ్డ మాట్లాడుతూ ‘ఓ మంచి సినిమా చూశామనే ఫీల్‌తో జనం థియేటర్ నుంచి బయటకెళ్తారు. ఇది నేను నమ్మకంతో చెబుతున్న మాట. దర్శకుడిగా నా తొలి సినిమాకు మంచి టీమ్ దొరకడం నా అదృష్టం.’ అని ఆనందం వెలిబుచ్చారు.
ఈ కథ తానే రాశానని, ైక్లెమాక్స్ చూశాక గూజ్బంప్స్ వచ్చాయని, అల్లరి నరేశ్ కెరీర్లో గమ్యం, నాంది సినిమాల తర్వాత చెప్పుకునే సినిమా ‘12A రైల్వే కాలనీ’ అవుతుందని కథకుడు, షోరన్నర్ అనిల్ విశ్వనాథ్ అన్నారు. ఇంకా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, కథానాయిక కామాక్షి, వైవాహర్ష కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సమర్పణ: పవన్‌కుమార్, నిర్మాణం: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి.