All We Imagine As Light | భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా (Payal Kapadia) దర్శకత్వంలో వచ్చిన ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ (All We Imagine As Light) చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్ట్వల్స్లో సత్తాచాటిన విషయం తెలిసిందే. ఇప్పటికే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాలకు నామినేట్ అయిన ఈ చిత్రం తాజాగా బాఫ్టా (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డులలో కూడా సత్తా చాటింది. బాఫ్టా 2025లో ఉత్తమ దర్శకుడి విభాగంతో పాటు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ ఫిల్మ్ నాట్ ఇన్ ఇంగ్లీష్ విభాగాల్లో ఈ చిత్రం నామినేట్ అయ్యింది. ఈ విషయాన్ని బాఫ్టా అధికారికంగా ప్రకటించింది. విజేతల జాబితాను ఈ నెల 15న వెల్లడించనున్నారు అకాడమీ నిర్వహాకులు.
ముంబయి నర్సింగ్ హోమ్‌లో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం గతేడాది జరిగిన ప్రతిష్ఠాత్మక 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ (Grand Prix award) అవార్డును గెలుచుకుంది. మరోవైపు ఈ సినిమాను చూసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (US Former President Barack Obama) ప్రశంసలు కురిపించాడు. మరోవైపు ఈ చిత్రం డిస్నీ + హాట్ స్టార్ వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.