RC16 | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చేస్తున్నాడని తెలిసిందే. షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన (Buchi Babu Sana) డైరెక్షన్లో RC16 మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆర్సీ 16 డైరెక్టర్ బుచ్చిబాబు, అసిస్టెంట్ డైరెక్టర్ రమణ రాంచరణ్‌ను కలిసిన స్టిల్ ఒకటి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చాలా రోజుల తర్వాత మేకర్స్ ఆర్సీ 16పై ఆసక్తికర అప్డేట్ అందించారు.
ఆర్సీ 16 పూజా కార్యక్రమం రేపు ఉదయం 10:10 గంటలకు నిర్వహించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫర్‌గా పనిచేయనుండగా.. పాపులర్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్- వృద్ధి సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఆర్సీ16 కోసం హైదరాబాద్‌లోని బీఎన్ఆర్ హిల్స్‌లో ప్రత్యేకంగా ఆఫీసును కూడా షురూ చేశారని తెలిసిందే.
రంగస్థలం డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చి బాబు.. రాంచరణ్లోని యాక్టింగ్‌ను మళ్లీ ఆ స్థాయిలో ఎలివేట్ చేసేలా సినిమా తెరకెక్కించబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. బాక్సాఫీస్ వద్ద రికార్డులు వర్షం కురిపించిన సుకుమార్, బుచ్చిబాబు, మైత్రీ మూవీ మేకర్స్, రాంచరణ్ క్రేజీ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ఆర్సీ 16పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఆర్సీ16 కథ తనకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అని, నాలుగేళ్లపాటు శ్రమించి కథను రెడీ చేశానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు బుచ్చి బాబు సాన. ఈ చిత్రంలో రాంచరణ్ కథానుగుణంగా ఉత్తరాంధ్ర మాండలికంలో మాట్లాడతాడట.
The most awaited project is all set to take off on an auspicious note❤️#RC16PoojaCeremony tomorrow at 10.10 AM.#RamCharanRevolts #RC16
Global Star @AlwaysRamCharan #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @vriddhicinemas @SukumarWritings @MythriOfficial pic.twitter.com/AgDo1lgK0T— RC 16 (@RC16TheFilm) March 19, 2024
Our Next #RC16 Director 📸✨ @BuchiBabuSana and Assistant Director Ramana with Our MAN OF MASSES @AlwaysRamCharan 🦁👑🔥🤩
RAW & RUSTIC #RamCharanRevolts LOADINGGGGG 💯🔥💥#ManofMassesRamCharan #RamCharan pic.twitter.com/NayCeAevqK
— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) January 4, 2024
ఆఫీస్ ప్రారంభోత్సవ ఫొటోలు..
The team of #RC16 from the office opening Pooja ❤️
Full fledged Pre-production underway💥
Mega PowerStar @AlwaysRamCharan @BuchiBabuSana @aryasukku @vriddhicinemas @SukumarWritings @MythriOfficial pic.twitter.com/8pjGiCARC2
— Vriddhi Cinemas (@vriddhicinemas) August 27, 2023