Maheshbabu-Rajamouli | మహేష్‌బాబు-రాజమౌళి ప్రాజెక్ట్‌పై మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీళ్ల కాంబోలో సినిమా ఎప్పుడు సెట్టవుతుందా అని అభిమానులు తెగ ఆరాటపడేవారు. ఆ నిరీక్షణకు ఫలితంగా మహేష్‌బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఫారెస్ట్ అడ్వేంచర్‌గా ఈ చిత్ర కథను విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశాడని సమాచారం. గతంలోనే వీటి గురించి ప్రకటన వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రారంభించి, 2024 దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ చిత్రంలో మహేష్‌బాబుకు జోడిగా అలియాభట్ నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అలియాభట్‌ను మేకర్స్ సంప్రదించగా ఇందులో నటించడానికి ఈమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రాజమౌళి సినిమాలో హీరోయిన్గా ఒక్క ఛాన్స్ వస్తేనే చాలు అనుకునే వారుంటారు.అలాంటిది అలియాభట్‌కు ఏకంగా రెండు సార్లు జక్కన్న దర్శకత్వంలో నటించే ఛాన్స్ వచ్చింది. అంతేకాకుండా మహేష్‌బాబుకు ఈ సినిమా మెదటి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనుంది. ఇక బాలీవుడ్లో అలియాభట్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది.ఈ క్రేజ్ సినిమాకు ఎంతో కొంత ప్లస్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నాడట.
దీనితో పాటుగా ఈమె కొరటాలశివ-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కతున్నసినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తుంది. మహేష్‌బాబు ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నాడు.ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘ట్రిపుల్ ఆర్’ భారీ అంచనాల నడుమ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ చిత్రంలో సీత పాత్రలో రామ్‌చరణ్‌కు జోడిగా అలియాభట్ నటించింది.