ఆ కోరిక తీరలేదు
సినిమాల్లో తాను ఎక్కువగా సీరియస్ పాత్రల్లో కనిపించినా..వ్యక్తిగతంగా మాత్రం కామెడీని ఇష్టపడతానని చెప్పింది బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియాభట్. ఆమె తాజా చిత్రం ‘డార్లింగ్స్’ ఆగస్ట్ 5న ఓటీటీలో విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది.
కెరీర్లో ఇప్పటివరకు పూర్తిస్థాయి వినోదాత్మక పాత్రను చేసే అవకాశం రాకపోవడం దురదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. అలియాభట్ మాట్లాడుతూ ‘చిన్నతనం నుంచి కామెడీ సినిమాల్ని ఇష్టపడేదాన్ని. గోవింద, కరిష్మాకపూర్ నా అభిమాన తారలుగా ఉండేవారు. హిందీతో పాటు హాలీవుడ్ కామిక్ చిత్రాలంటే ఎంతో మక్కువ ఉండేది.
నటిగా మారిన తర్వాత మాత్రం కామెడీ రోల్స్ పోషించే అవకాశం రాలేదు. కామెడీ జోనర్ ఎప్పటికీ నా ఫేవరేట్. కెరీర్లో ఫుల్లెంగ్త్ కామెడీ సినిమా చేయాలనే కోరిక ఒక్కటి మిగిలిపోయింది’ అని చెప్పింది. ‘డార్లింగ్స్’ సినిమాలో నటించడమే కాకుండా చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా మారింది అలియాభట్. నిర్మాతగా ఆమెకిది తొలి చిత్రం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సినిమాతో పాటు అలియాభట్ ‘బ్రహ్మాస్త్ర’ ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

