Brahmastra | ‘బ్రహ్మస్త్ర’ పోస్టర్ విడుదల.. ఆకట్టుకుంటున్న రణ్‌బీర్, ఆలీయా లుక్
బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలీయాభట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రహ్మస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. తెలుగులో ఈ చిత్రానికి రాజమౌళి సమర్పకుడి వ్యవహిరిస్తున్నాడు.
Brahmastra | బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలీయాభట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. తెలుగులో ఈ చిత్రానికి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. రాజమౌళి ఈ చిత్రంలో భాగం కావడంతో సినిమా క్రేజ్ రెట్టింపు అయింది. ఇటీవలే ఈ చిత్రం వారణాసిలోని కాశీలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రల్లో నటించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి రణ్‌బీర్, ఆలీయా కలిసి ఉన్న పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
బ్రహ్మస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ సోషల్ మీడియాలో ‘ప్రేమ అంటే కాంతి. బ్రహ్మాస్త్రలోని మొదటి అధ్యాయాన్ని పార్ట్ 1: శివ అని చాలా కాలంగా మనం పిలుస్తున్నాం. కానీ పార్ట్ 1 అంటే ప్రేమ. ఎందుకంటే బ్రహ్మాస్త్ర ప్రధానాంశం ప్రేమకు ఉన్న శక్తికి సంబంధించినది. ఈ ప్రేమ అగ్నిలా అన్నివైపులా వ్యాపించి సినిమాను దాటి నిజ జీవితంలోకి అడుగుపెట్టింది. ఇదిగో మా లవ్ పోస్టర్. దీనికి సరైన సమయం ఇదే అనిపిస్తుంది’ అంటూ రణ్‌బీర్, ఆలీయాల పోస్టర్‌ను షేర్ చేశాడు. మూడు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం మొదటి భాగం ‘శివ’ హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. కాగా రణ్‌బీర్, ఆలీయాల పెళ్ళి ఏప్రిల్ 14న ముంబైలోని ఆర్కే బంగ్లాలో జరుగనుంది.
Read Also:
Dulquer Salmaan | దుల్కర్ తెలుగు సినిమా టైటిల్ ప్రకటన.. ఆకట్టుకుంటున్న స్పెషల్ గ్లింప్స్
Allari Naresh | ఎలక్షన్ అధికారిగా అల్లరినరేష్.. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో నెక్స్ట్ సినిమా
Pawan Kalyan | చిరంజీవి కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనున్నాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
రిమ్స్ బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా.. రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన కోవ లక్ష్మి
GLP-1 Medicine | బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులను వాడితే కండరాల నష్టం జరుగుతుందా..? ఏం చేయాలి..?
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

