Dulquer Salmaan | దుల్కర్ తెలుగు సినిమా టైటిల్ ప్రకటన.. ఆకట్టుకుంటున్న స్పెషల్ గ్లింప్స్
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. 'ఓకే బంగారం' సినిమాతో పరిచయమైన దుల్కర్ 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మహానటి తర్వాత ఈయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతున్నాయి.
Dulquer Salmaan | మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘ఓకే బంగారం’ సినిమాతో పరిచయమైన దుల్కర్ ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మహానటి తర్వాత ఈయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఈయన తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇదివరకే విడుదలైన ప్రచార చిత్రాలు, హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్ టీజర్లు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. శ్రీరామనవమీ సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
‘ఇది ఓ సైనికుడు శత్రువుకు అప్పగించిన యుద్ధం అఫ్రీన్. ఈ యుద్ధంలో సీతారాములను నువ్వే గెలిపించాలి’అంటూ సుశాంత్ వాయిస్ ఓవర్‌తో మొదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. ‘సీతారాములా ? ఎవరు వాళ్ళు’ అంటూ రష్మిక పలికే సంభాషణతో దుల్కర్ సల్మాన్, మృనాల్ తాకూర్లు పరిచయమవుతారు. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. ‘సీతారామం’గా ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించగా మృనాల్ సీత పాత్రలో నటిస్తుంది. రష్మిక కాశ్మీరి ముస్లిం అమ్మాయిలా నటిస్తుంది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

