Actress Alia Bhatt | వారసత్వం అనే ట్యాగ్‌ను మెడలేసుకొని వచ్చినా.. తన నటన, అభినయంతో సొంత గుర్తింపుని తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. ఓ వైపు గ్లామర్ పాత్రల్లో నటిస్తూనే.. మరో వైపు నటన ప్రాధాన్యమున్న పాత్రలతో మెప్పిస్తూ హిందీ నాట టాప్ హీరోయిన్లో ఒకరిగా దూసుకుపోతుంది. ఇక గతేడాది ఆర్ఆర్ఆర్తో టాలీవుడ్లోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంది. తారక్, చరణ్‌లతో పోటీ పడి మరీ నటించింది. మూడు గంటల సినిమాలో కనిపించేది పది, పదిహేను నిమిషాలే. కానీ సీత పాత్రతో ప్రేక్షకుల్లో బాగానే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. పైగా హిందీలో ఆర్ఆర్ఆర్ సినిమాను భారీ స్థాయిలోనే ప్రమోట్ చేసింది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ హాలీవుడ్‌తో నాటు నాటు స్టెప్పులేయించిన వీడియో ఒకటి నెట్టింట సంచలనం అవుతుంది. ప్రస్తుతం అలియాభట్ నటించిన హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ మరో మూడు రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో అలియా చిత్రయూనిట్‌తో కలిసి ప్రమోషన్లు చేస్తుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా మరో హీరోయిన్ గల్ గాడోట్‌కు తెలుగు నేర్పిస్తూ అలరించింది. అంతేకాకుండా ఆస్కార్ గెలిచిన నాటు నాటు పాటకు గల్ గాడోట్‌తో స్టెప్పులేయించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Sita @aliaa08 Teaching Global Sensational #NaatuNaatu Hook Step to @GalGadot 💃💃. #RRRMovie @RRRMovie pic.twitter.com/tlXgArnUxt
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) August 8, 2023