Alia Bhatt Singing Chuttamalle | ఎన్టీఆర్ ‘దేవర’ ఫీవర్ బాలీవుడ్ వరకు పాకింది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలను సోషల్ మీడియాలో నెటిజన్లు రీల్స్ చేస్తూ అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీలోని చుట్టమల్లే చుట్టేస్తాందే అనే పాటను బాలీవుడ్ నటి అలియా భట్ పాడింది. అలియా భట్ కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిగ్రా’. ఈ సినిమాను ధర్మ ప్రోడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహర్ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాతో పాటు దేవర సినిమాను కరణ్ జోహర్ బాలీవుడ్లో పంపిణీ చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో భాగంగా ‘దేవర’ కా ‘జిగ్రా’ పేరిటా ఒక ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఈ ఇంటర్వ్యూలోనే ఎన్టీఆర్ దేవర సినిమాతో పాటు అలియా భట్ తన ‘జిగ్రా’ సినిమా విశేషాలను పంచుకుంది. అయితే ఈ ఇంటర్వ్యూలో అలియా భట్ దేవర సినిమాలోని చుట్టమల్లే చుట్టేస్తాందే పాటను పాడింది. తెలుగులో పాడిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Alia Bhatt singing telugu song Chuttamalle from devara pic.twitter.com/F6MOoDvhB3
— ⋆ (@aliacentric) September 24, 2024