Alia Bhatt – Ranbir Kapoor | ఎట్టకేలకు కూతుర్ని కెమెరా ముందుకు తెచ్చిన ఆలియా-రణ్‌బీర్
Alia Bhatt - Ranbir Kapoor | బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఎట్టకేలకు తమ గారాలపట్టి కెమెరా ముందుకు తీసుకొచ్చారు. ఐదేండ్ల లవ్ జర్నీ తర్వాత గత ఏడాది ఏప్రిల్‌లో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అదే ఏడాది వీరికి ఒక పాప కూడా జన్మనిచ్చింది.
Alia Bhatt – Ranbir Kapoor | బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఎట్టకేలకు తమ గారాలపట్టి కెమెరా ముందుకు తీసుకొచ్చారు. ఐదేండ్ల లవ్ జర్నీ తర్వాత గత ఏడాది ఏప్రిల్‌లో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అదే ఏడాది వీరికి ఒక పాప కూడా జన్మనిచ్చింది. అప్పట్నుంచి ఆ పాప ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎంతో ఉత్సుకత చూపించారు. కానీ అటు ఆలియా కానీ.. ఇటు రణ్‌బీర్ కపూర్ కానీ తమ కూతురు ఫొటోను బయటపెట్టలేదు. ఫొటోగ్రాఫర్లను కూడా ఫొటోలు తీసేందుకు అనుమతించలేదు. పాపకు రెండేండ్లు వచ్చేదాకా ఫొటోలు బయటపెట్టే ఉద్దేశ్యం లేదని ఆలియా సన్నిహితులు ఇదివరకు స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు తమ కూతుర్ని రణ్‌బీర్-ఆలియా దంపతులు కెమెరా ముందుకు తీసుకొచ్చారు.
క్రిస్మస్ సందర్భంగా తమ గారాలపట్టి రాహా కపూర్‌తో ముంబైలో ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ జంట సందడి చేశారు. తమ కూతురు రాహాను మీడియా వాళ్లకు చూపించారు. ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు.. రాహా చూడటానికి చాలా అందంగా, బబ్లీగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. పాపకు ఆలియా భట్ పోలికలే ఎక్కువగా వచ్చాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫొటోలను షేర్ కూడా చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

