మితిమీరిన ఉత్సాహం ఎవరికైనా మంచిది కాదు. రీసెంట్గా కొందరు ఫొటోగ్రాఫర్లు ముంబయ్‌లో అలియా భట్ ఇంటిముందు మోహరించారు. సరిగ్గా ఆమె పికిల్ బాల్ గేమ్ ఆడి ఇంటికొచ్చే సమయం కోసం వేచివున్న వారంతా.. అలియా కారు ఇంటిముందు ఆగిందో లేదో, తమ కెమెరాలకు పని చెప్పడం మొదలుపెట్టారు. కొందరైతే ఆమె వెనకే ఇంటిలోపలికి కూడా వచ్చేందుకు ప్రయత్నించారు. దాంతో అలియా అసహనానికి లోనై ఫోటోగ్రాఫర్లపై సీరియస్ అయ్యారు. ‘లోపలికి రాకండి..
ఇదేం మీ ఇల్లు కాదు.. దయచేసి బయటకు వెళ్లండి..’ అంటూ ఘాటుగా స్పందించారు. దాంతో ఫొటోగ్రాఫర్లంతా బయటకు నడిచారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఫొటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అనుమతి లేకుండా ఫొటోలు తీసే అధికారం ఎవరిచ్చారు వీళ్లకు?’ అని ఒకరు కామెండ్ చేయగా, మితిమీరిన ఉత్సాహం ఎప్పటికైనా ప్రమాదమే అని మరో యూజర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.