బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రామ్‌సేతు. అభిషేక్ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్టులో అక్షయ్‌కుమార్ ఆర్కియాలజిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. రామ్‌సేతు షూటింగ్ ఇవాళ షురూ అయింది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. లాంగ్ గ్రే హెయిర్ లుక్ తో ఉన్న అక్షయ్ చేతిలో స్క్రిప్ట్ కనిపిస్తుండగా..నుస్రత్ బరూచా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఆ స్క్రిప్ట్‌ను చదువుతున్న స్టిల్‌ను జాక్వెలిన్ పోస్ట్ చేసింది.
రామ్‌సేతు షూటింగ్ మొదలైంది. మీ ప్రార్థనల్లో మమ్మల్ని ఉంచండి..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. యూపీలోని అయోధ్యలో ప్రధాన భాగం షూటింగ్ జరుగనుండగా..అక్షయ్‌కుమార్ చిత్రీకరణ కోసం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి అవసరమైన అనుమతులు తీసుకున్నాడు. రామ్‌సేతు వెనకు దాగి ఉన్న వాస్తవాలను విజువల్ ట్రీట్‌తో చూపించబోతున్నారు.