Ram Setu Movie | ‘రామ్‌సేతు’ ట్రయిలర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Ram Setu Movie Trailer | బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తుంటాడు. ఇప్పటికే ఈ ఏడాది ఈయన నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అయితే అందులో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
Ram Setu Movie Trailer | బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తుంటాడు. ఇప్పటికే ఈ ఏడాది ఈయన నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అయితే అందులో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఈయనకు కమర్షియల్‌గా మంచి బ్రేక్ ఇచ్చే సినిమా కావాలి. ఈ క్రమంలోనే ‘రామ్‌సేతు’ వంటి యాక్షన్ అడ్వేంచర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్లను స్టార్ట్ చేశారు.
ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. రామ్‌సేతు ట్రైలర్‌ను అక్టోబర్ 11న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అక్షయ్‌కు జోడీగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నుష్రత్ భారుచ్చా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నాడు. అమెజాన్, లైకా సంస్థలతో కలిసి విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా ఈ చిత్రాన్ని నిర్మిస్తుస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.
Read Also:
Alluri Movie | అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘అల్లూరి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Waltair Veerayya | చిరు అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘మెగా 154’ టీజర్ వచ్చేది అప్పుడేనట..!
Dhruva-2 | తెరపైకి మరో బ్లాక్ బాస్టర్ సీక్వెల్.. ‘ధృవ-2’ తెరకెక్కనుందా?
రూ.48 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొన్న బాలీవుడ్ నటి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

