Sree Vishnu’s Alluri Movie On OTT | టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు రొటీన్‌కు భిన్నంగా సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈయన సినిమాలకు కంటెంట్ పరంగా ప్రశంసలు దక్కుతున్న.. కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోతున్నాయి. ఇటీవలే ఈయన నటించిన ‘అల్లూరి’ విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోగ్రఫీగా తెరకెక్కింది. కాగా ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రం శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 23న రిలీజైన ఈ చిత్రం రెండు వారాల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. శ్రీవిష్ణు మొదటి సారిగా ఫుల్ లెంగ్త్ పోలీస్ అధికారిగా ఈ చిత్రంలో కనిపించాడు. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోతో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయించినా.. శ్రీవిష్ణుకు కలిసి రాలేదు. కాగా అదే రోజున నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి విడుదలై పాజిటీవ్ టాక్ తెచ్చుకోంది.