Dhruva-2 | తెరపైకి మరో బ్లాక్ బాస్టర్ సీక్వెల్.. ‘ధృవ-2’ తెరకెక్కనుందా?
Dhruva-2 Movie | రామ్‌చరణ్ సినిమాలలో 'ధృవ'కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా కమర్షియల్‌గానే కాకుండా చరణ్ నటనపై విమర్శలు కురిపించిన వారి నోటీకి తాళం వేసింది. అప్పటివరకు రామ్‌చరణ్ నటన ఒకెత్తయితే ఈ చిత్రంలో నటన మరో ఎత్తు. నిజానికి 'మగధీర' తర్వాత చరణ్ కెరీర్లో ఆ స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు.
Dhruva-2 Movie | రామ్‌చరణ్ సినిమాలలో ‘ధృవ’కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా కమర్షియల్‌గానే కాకుండా.. చరణ్ నటనపై విమర్శలు కురిపించిన వారి నోటీకి తాళం వేసింది. అప్పటివరకు రామ్‌చరణ్ నటన ఒకెత్తయితే ఈ చిత్రంలో నటన మరో ఎత్తు. నిజానికి ‘మగధీర’ తర్వాత చరణ్ కెరీర్లో ఆ స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు. దాదాపు ఏడేళ్ళ తర్వాత ‘ధృవ’తో ఆ స్థాయి విజయాన్ని సాధించాడు. ఈ చిత్రం తర్వాత రామ్‌చరణ్ నటనలో మార్పులు, కథల ఎంపిక పూర్తిగా మారింది. కాగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ విజయాన్ని సాధించాడు. దాదాపు రూ.90 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. కాగా తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతుంది. ప్రొడ్యూసర్ ఎన్.వీ ప్రసాద్ తాజాగా ‘ధృవ-2’ తెరకెక్కనున్నట్లు కన్ఫార్మ్ చేశారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయట. కాగా ఈ చిత్రానికి ‘గాడ్‌ఫాదర్’ ఫేం మొహన్‌రాజా దర్శకత్వం వహించనున్నాడట. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఈ వార్తతో మెగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. అయితే కొందరు నెటీజన్లు గాడ్‌ఫాదర్ రిజల్ట్ తర్వాత దీనిపై క్లారిటీ వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

