అక్షయ్‌కుమార్ నటించిన తాజా చిత్రం ‘సెల్ఫీ’. ఇందులో ఆయన సినిమా హీరో పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ స్నేహితుడి పాత్రలో నటించిన ఆకాశదీప్ సబీర్ నటుడిగా అక్షయ్ ప్రత్యేకతను వివరించారు. ఆయన మాట్లాడుతూ…‘ఈ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్లో నటించాను. సాధారణంగా హీరోలు తోటి పాత్రధారులకు ఎక్కువ డైలాగ్స్ ఇవ్వడాన్ని ఇష్టపడరు. కానీ అక్షయ్ అలా కాదు. నేను వేసే పంచ్‌లను ఎంజాయ్ చేశాడు. తన పాత్రకు ఇచ్చే కొన్ని డైలాగ్స్ మార్చి నన్ను చెప్పమన్నాడు. అక్షయ్ కెరీర్ ప్రారంభంలో ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. సెట్లో అతని వల్ల ఏ ఇబ్బందీ ఉండదు’ అని చెప్పారు.