Akshay Kumar : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన పంజాబ్ (Punjab) ప్రజలను ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించాడీ యాక్షన్ హీరో. వరద విలయంతో విలవిలలాడిని వాళ్ల పునరావాసం కోసం రూ.5 కోట్లు ఇస్తున్నట్టు అక్షయ్ వెల్లడించాడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నాడీ రియల్ హీరో.
‘అవును.. పంజాబ్‌లోని వరద బాధితుల సహాయార్థం.. వారి పునరావాసం కోసం రూ.5 కోట్లు విరాళంగా ఇస్తున్నాను. తీవ్రంగా నష్టపోయిన వాళ్లను ఆదుకునేందుకు నా వంతు సాయం చేయడాన్ని దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నావరకైతే ఇది విరాళం కాదు. సేవ మాత్రమే. వరద బాధితులకు నా తరఫున చిన్న మొత్తం అందిస్తున్నా. పంజాబ్‌లోని నా సోదరులు, సోదరీమణులను వరదలో చిక్కుకునేలా చేసిన ప్రకృతి ప్రకోపం చల్లారాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నా. మీ అందరిపై ఆ భగవంతుడి దయ ఉండుగాక’ అని అక్షయ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
Akshay Kumar Contributes Rs 5 Crore For Punjab Floods Relief, Calls It ‘Not Donation, But Sewa’#PunjabFloods #AkshayKumar #TNCards https://t.co/fnYN2y2ICW pic.twitter.com/al37y1gXRu
— TIMES NOW (@TimesNow) September 5, 2025
హిందీ చిత్రసీమలో ఒకప్పుడు యాక్షన్ కింగ్‌గా పేరొందిన అక్షయ్ కుమార్ దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్ధిక సాయంతో ముందుకు రావడం ఇదే మొదటిసారి కాదు. చెన్నై వరదలు, కరోనా వైరస్ విజృంభించన సమయంలోనూ ఈ సూపర్ స్టార్ భారీ విరాళం ప్రకటించాడు. అంతేకాదు భారత్‌కే వీర్ అనే కార్యక్రమం ద్వారా సైనికుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నాడీ కేసరి ఫేమ్. కెరీర్ ప్రారంభంలో యాక్షన్, ఆపై కామెడీ చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చిన అక్షయ్.. ఈ మధ్య మహిళా సాధికారత, దేశ భక్తికి పెంపొందించే సినిమాలకు కేరాఫ్ అవుతున్నాడు. ఈ బాలీవుడ్ స్టార్ నటించిన టాయిలెట్, ప్యాడ్‌మన్, మిషన్ మంగల్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.