Jaya Bachchan | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథ’ (Toilet Ek Prem Katha) చిత్రంపై బాలీవుడ్ నటి, ఎంపీ జయాబచ్చన్ (Jaya Bachchan) విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించాడు అక్షయ్ కుమార్.
అక్షయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కేసరి-2. అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనేది ట్యాగ్‌లైన్. మాధవన్, రెజీనా కసాండ్రా, అనన్య పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహిస్తుండగా.. ధర్మ ప్రోడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే కేసరి-2 మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు అక్షయ్ కుమార్. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో జయా బచ్చన్ ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథ’ టైటిల్‌పై చేసిన కామెంట్స్‌పై స్పందించారు.
టాయిలెట్ సినిమాపై జయా బచ్చన్ అలా మాట్లాడి ఉంటే ఆమె చెప్పింది నిజమే. నేను అలాంటి సినిమా తీసి తప్పు చేసి ఉంటే, ఆమె చెప్పింది నిజమే కావచ్చు. ఈ కామెంట్లను నేను స్వాగతిస్తున్న అంటూ అక్షయ్ చెప్పుకోచ్చాడు.
అక్షయ్ కుమార్, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’. ఈ సినిమాకు శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పెళ్లి చేసుకొని అత్తారింటికి రావాల్సిన యువతి వరుడి ఇంట్లో టాయిలెట్ లేదని.. టాయిలెట్ కట్టిస్తేనే అత్తాగారింట్లో అడుగుపెడతానని షరతు పెడుతుంది. అయితే ఇంట్లో టాయిలెట్ కట్టించవద్దని వరుడి తండ్రి అడ్డుపడతాడు. ఈ క్రమంలోనే వరుడు ఏం చేశాడనేది ఈ సినిమా కథ.
అయితే ఈ సినిమాను ఉద్దేశించి జయా బచ్చన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ఫ్లాప్ అని తెలిపారు. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ అనే టైటిల్ నాకు అస్సలు నచ్చలేదు. ఆ పేరును ఒక్కసారి చూడండి. అలాంటి టైటిల్‌తో సినిమా చూడాలని నేను ఎప్పటికీ అనుకోను. అసలు అది పేరా? నిజంగా దాన్ని పేరు అని అంటారా? అని వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.