Hera Pheri 3 | బాలీవుడ్ కల్ట్ కామెడీ ఫ్రాంచైజీ ‘హేరా ఫేరీ 3’ చుట్టూ వివాదాలు అలుముకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి నటుడు పరేష్ రావల్ అకస్మాత్తుగా తప్పుకోవడంతో సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
అయితే ఈ విషయంపై సీరియస్ అయిన అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ ‘కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్’, ఒప్పందాన్ని ఉల్లంఘించి, తమకు భారీ ఆర్థిక నష్టాలను కలిగించినందుకు పరేష్ రావల్పై రూ. 25 కోట్ల దావా వేసింది. పరేష్ రావల్ అడ్వాన్స్ తీసుకుని, ఒక రోజు షూటింగ్ లో కూడా పాల్గొన్న తర్వాత ఇలా సడెన్ గా సినిమాను మధ్యలో వదిలేయడం వల్ల భారీ నష్టం వాటిల్లిందని నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది.
ఇదిలావుంటే, తాజాగా ఈ వివాదంపై మరోసారి స్పందించారు అక్షయ్ కుమార్. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘హౌస్ఫుల్ 5’ చిత్రం జూన్ 06న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ వేడుకలో మీడియా ‘హేరా ఫేరీ 3’ వివాదం గురించి అడగగా, అక్షయ్ సమాధానమిస్తూ…
”నా సహనటులలో ఒకరి కోసం ‘మూర్ఖత్వం’ లాంటి పదాలు ఉపయోగించడం నాకు ఇష్టం లేదు. ఆయనతో నేను 30-32 సంవత్సరాలకు పైగా కలిసి పని చేశాను. మేము మంచి స్నేహితులం, ఆయన చాలా గొప్ప నటుడు, నేను ఆయనను ఎంతగానో అభినందిస్తాను” అని అక్షయ్ కుమార్ అన్నారు. ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇది సరైన స్థలం కాదని, కోర్టు దీనిని చూసుకుంటుందని.” అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.
#WATCH | Mumbai | On Actor Paresh Rawal’s exit from upcoming film ‘Hera Pheri 3’, Actor Akshay Kumar says, “I don’t appreciate using words like ‘foolish’ for one of my co-stars with whom I have worked for over 30-32 years. We are very good friends, he is a very good actor, and I… pic.twitter.com/mwP4FtkzsU
— ANI (@ANI) May 27, 2025