Akshay Kumar CUTTPUTTLI Trailer | ఫలితం ఎలా ఉన్నా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మాత్రం వరుస సినిమాలను విడుదల చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఈ మూడు బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫేయిల్యూర్స్గా మిగిలాయి. ఇటీవలే ‘రక్షా బంధన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం ఈయన ఒక హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన నటించిన ‘కట్పుట్ల్లీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలో సూపర్ హిట్టయిన ‘రాట్ససన్’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ పేరుతో రీమేక్ చేశాడు. తాజాగా డిస్నీ+హాట్‌స్టార్ కట్పుట్ల్లీ ట్రైలర్‌ను విడుదల చేసింది.
లేటెస్ట్గా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ట్రయిలర్‌ను గమనిస్తే సినిమాలో ఎలాంటి మార్పులు చేయకుండా రాట్ససన్ ఫ్లేవర్‌ను మిస్ చేయకుండా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. అయితే లొకేషన్ మాత్రం ఫారిన్‌కు చేంజ్ చేసినట్లు కనిపిస్తుంది. రంజిత్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌కు జోడీగా రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటించింది. పూజా ఎంటర్టైనమెంట్ బ్యానర్‌పై ఆసీమ్ అరోరా ఈ చిత్రాన్ని నిర్మించాడు. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో సెప్టెంబర్2 నుండి స్ట్రీమింగ్ కానుంది.