Jolly LLB 3 | బాలీవుడ్ స్టార్ నటులు అక్షయ్‌కుమార్ (Akshay Kumar), అర్షద్ వార్సీ (Arshad Warsi) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జాలీ ఎల్ఎల్బీ 3’ (JollyLLB3). కోర్టు రూమ్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం ‘జాలీ ఎల్ఎల్బీ’ సిరీస్‌లో రాబోతున్న మూడో చిత్రం. మొదటి చిత్రంలో జాలీగా అర్షద్ వార్సీ నటించి హిట్‌ని అందుకోగా.. రెండో పార్టులో అక్షయ్‌కుమార్ జాలీగా నటించి హిట్‌ని అందుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి జాలీ ఎల్ఎల్బీ 3లో రాబోతున్నారు. ఈ సినిమాకు సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తుండగా.. అలోక్ జైన్, అజిత్ అంధారే నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ ట్రైలర్‌ను ఫుల్ ఫన్నీగా సాగింది.