Akkineni Sushanth | హిట్లతో ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు సుశాంత్. అక్కినేని నటవారసుడిగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్‌కు ఇప్పటివరకు సరైన హిట్టు పడలేదు. ఈయన సినిమాలను దాదాపు ఒకే స్టోరీ లైన్‌తో ఉంటాయి. దాంతో ప్రేక్షకలు కూడా ఈయన సినిమాలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపించడం లేదు. కరెంట్, చి.లా.సౌ వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించేక పోయాయి.
సుశాంత్ మొదటిసారిగా ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ చిత్ర బృందం బర్త్‌డే విషెస్‌ను తెలిపింది. ఈ వెబ్‌సిరీస్‌కు వరుడు కావలెను ఫేం లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తుంది. కొల్లా ఎంటర్టైనమెంట్స్ పతాకంపై కొల్లా ప్రవీణ్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాడు. ఇటీవలే అక్కినేని నటవారసుడు నాగచైతన్య కూడా ధూత అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. విక్రమ్ కే కుమార్ ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు.