తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటిస్తున్న చిత్రం ‘మాధవే మధుసూదన’. బొమ్మదేవర రామచంద్ర రావు స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ప్రచారంలో భాగంగా ఈ చిత్రంలోని ‘అలాంటి అందం’ అనే లిరికల్ పాటను హీరో నాగచైతన్య విడుదల చేశారు. ప్రేమ పయనంలో భావాలకు ఈ పాట అద్దం పడుతుందని దర్శకుడు తెలిపారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి దర్శక, నిర్మాత చంద్ర గారు నాకు తెలుసు. ఇప్పుడు విడుదల చేసిన పాటను చూశాను. చాలా బాగా చిత్రీకరించారు. ఈ చిత్రంతో హీరోగా తేజ్‌కు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అన్నారు.