Akkineni Akhil | తొమ్మిదేళ్ల క్రితం మనం అనే సినిమాలో అఖిల్ గెస్ట్ రోల్‌కే అక్కినేని ఫ్యాన్స్ ఊగిపోయారు. ఆ తర్వాతి ఏడాది అఖిల్ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఒక డెబ్యూ హీరోకు ఆ రేంజ్ సెలబ్రేషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రీతిలో జరిగాయి. అయితే ఎంత కాదన్నా ఎన్నో ఆశలతో థియేటర్‌కు వచ్చిన అక్కినేని అభిమానులను మాత్రం ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత హలో పర్వాలేదనిపించినా, కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. ఇక మిస్టర్ మజ్ను అయితే అక్కినేని ఫ్యాన్స్‌కు కూడా చిరాకు తెప్పించింది. కాస్తో కూస్తో అఖిల్‌కు పేరుతెచ్చిపెట్టింది మాత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా అఖిల్‌కు తొలిహిట్. అయినా కానీ ఫ్యాన్స్‌లో ఏదో అసంతృప్తి.
అక్కినేని ఫ్యాన్స్‌కు అది సరిపోలేదు. దాంతో అఖిల్ తనను తాను పూర్తిగా మేకోవర్ చేసుకుని ఏజెంట్ సినిమాతో వస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ మూవీలో అఖిల్ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమాను ఏప్రిల్ 28న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. అయితే గత రెండు మూడు రోజులుగా ఈ సినిమా పోస్ పోన్ అవుతుందంటూ వార్తలు వస్తునే ఉన్నాయి. కాగా అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అందులో డేట్‌ను కూడా ప్రకటించారు. దాంతో ముందుగా ఫిక్స్ చేసిన డేట్‌కే ఏజెంట్ సినిమా వస్తుందనే క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలో అఖిల్ వరుస ప్రమోషన్లు జరుపుతూ తెగ బిజీ అయిపోయాడు. కాగా తాజాగా సుమతో జరిపిన ఇంటర్వూలో సినిమా విశేషాలను, సినిమా వెనుక పడిన కష్టాన్ని పంచుకున్నాడు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.