Akhira: అకీరాని కోరిక కోరిన రేణూ దేశాయ్.. బర్త్‌డే రోజు తల్లిని సర్ప్రైజ్ చేసిన పవన్ తనయుడు

పవన్, రేణూ దేశాయ్‌ల పిల్లలు అకీరా, ఆద్య ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వారికి సంబంధించిన ఏ వీడియో బయటకు వచ్చినా కూడా అది కొద్ది నిమిషాలలోనే వైరల్ అవుతూ ఉంటుంది. అతిత్వరలోనే అకీరా నటుడిగా అరంగేట్రం చేయనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రేణుదేశాయ్ కూడా తన పిల్లలు సినిమారంగంలో ఎంట్రీ ఇస్తానంటే వాళ్ళ ఇష్టమని, ఈ విషయంలో తనకేమీ అభ్యంతరం లేదని ఎప్పుడో చెప్పేసింది.
అకీరా మల్టీ టాలెంటెడ్ అనే విషయం తెలిసిందే. ఆ మధ్య అకీరాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను రేణూదేశాయ్ షేర్ చేసుకుంది. అకీరా ఆ వీడియోలో కర్రసామును చేస్తూ కన్పించాడు. అతను వీడియోలో చాలా షార్ప్‌గా, పట్టుతో కర్రసాము చేయడం చూస్తుంటే అందులో బాగానే నైపుణ్యం సాధించినట్టుగా కనిపించాడు. ఇక పియానో కూడా అకీరా బాగా ప్లే చేస్తాడు. ఈ క్రమంలో రేణూ దేశాయ్.. అకీరాని ఓ కోరిక కోరిందట.
నెల రోజుల క్రితం అకీరా నందన్‌ను ఓ కోరిక కోరినట్టు రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. తనకు ఎంతో ఇష్టమైన పాటను తన బర్త్ డే రోజున పియానో మీద ప్లే చేసి వినిపించమని అడిగిందట. దీంతో ఆ పాటను వినిపించేశాడు. ఇంతకంటే మంచి గిఫ్ట్ ఇంకొకటి ఉండదంటూ రేణూ దేశాయ్ తన కొడుకుని చూసి మురిసిపోతోంది. సోషల్ మీడియాలో అకీరా పియానో ప్లే చేస్తున్న వీడియో షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది. రీసెంట్గా ఆద్య పాడిన పాటను, ప్లే చేసిన గిటార్ వీడియోను షేర్ చేసింది. ఆద్య టాలెంట్ గురించి గొప్పగా చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

