Akira Nandan | ఈ మధ్య సెలబ్రిటీలకి సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా క్లీన్‌గా అబ్జర్వ్ చేయడం, వాటిపై ఏదో రకమైన ట్రోలింగ్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు అకీరాని ట్రోల్ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమారులు అకీరా నందన్, మార్క్ శంకర్‌లతో కలిసి అధికార పర్యటన కోసం మంగళగిరికి వెళ్లారు. అయితే ఈ పర్యటనలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం పవన్ కాదు, ఆయన పెద్ద కుమారుడు అకీరా నందన్ అయ్యాడు.పవన్ పక్కన నిల్చున్న అకీరాను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు.
అకీరా లుక్ అచ్చం పవన్ కళ్యాణ్‌ను తలపించడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఒక్క హైట్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఫేస్ కట్స్, స్టైల్, నడక, హెయిర్ స్టైల్ అన్నీ పవన్ కళ్యాణ్‌ను గుర్తు చేసేలా ఉన్నాయంటూ మురిసిపోయారు.. రీసెంట్గా విడుదలైన హరి హర వీరమల్లు టీజర్‌లోని పవన్ లుక్స్‌ను చూసినప్పుడు ‘ఇందులో అకీరా నటించాడేమో’ అని అనుకునేలా ఇద్దరి మధ్య ఉన్న పొలికలు ఉన్నాయి. అకీరా స్టైల్, ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా యంగ్ పవన్ స్టైల్‌ను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. సింపుల్ లుక్‌లోనే అట్రాక్ట్ చేస్తున్న అకీరా.. మ్యూజిక్, ఫైట్స్, మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యం సాధిస్తున్నాడు. జపనీస్ ఆర్ట్ బో స్టాఫ్, కరాటే, బాక్సింగ్లతో పాటు వయోలిన్లోనూ మంచి నైపుణ్యం కలిగి ఉన్నాడని సమాచారం.
అకీరా వెండితెర ఎంట్రీపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా, ఆయన అభిమానులు మాత్రం అకీరా త్వరలో వెండితెర ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు. అయితే ఇదే సమయంలో కొందరు యాంటి ఫ్యాన్స్ అకీరాని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇటీవల పవన్‌తో మెరిసిన అకీరా ఆ సమయంలో తన తండ్రి ప్యాంట్ వేసుకొని వచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ వేసుకున్న ప్యాంట్‌ని కప్బోర్డ్ నుండి తీసుకొని అకీరా వేసుకొని వచ్చాడంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనికి మెగా ఫ్యాన్స్ గట్టిగానే బదులు ఇస్తున్నారు. అవి రెండు సేమ్ మోడల్ ఉన్నా కలర్ కాస్త తేడా ఉంది. అంతేకాదు ఇద్దరి సైజులు వేరు కూడా. కాస్త తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందంటూ గట్టి వార్నింగ్‌లు ఇస్తున్నారు.