అకీరా నందన్‌ను పరిచయం చేసే నిర్మాత అతనేనా..?
అకీరా నందన్.. ఈ పేరుకు తెలుగులో చాలా ఇమేజ్ ఉంది. దీనికి కారణం అతడు పవన్ కల్యాణ్ కుమారుడు కావడమే. పవన్, రేణు దేశాయ్ దంపతుల పుత్రుడే అకీరా నందన్.

అకీరా నందన్.. ఈ పేరుకు తెలుగులో చాలా ఇమేజ్ ఉంది. దీనికి కారణం అతడు పవన్ కల్యాణ్ కుమారుడు కావడమే. పవన్, రేణు దేశాయ్ దంపతుల పుత్రుడే అకీరా నందన్. ఈ కుర్రాడు కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. అప్పట్లో అమ్మతో కలిసి పూణేలో ఉన్న అకీరా.. ఇప్పుడు చెల్లితో కలిసి సిటీలోనే ఉంటున్నాడు. చిన్ననాటి నుంచి కూడా అకీరా నందన్ బయటికి వస్తూనే ఉన్నాడు. ఫోటోలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఒక్కసారిగా ఈయన ఎదిగిపోయిన తీరు చూసి అంతా షాక్ అయ్యారు. కొన్ని రోజులుగా అకీరా ఎక్కడ కనిపించినా కూడా వారెవ్వా అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ కుటుంబంలో వరుణ్ తేజ్ కంటే హైట్ అయిపోయాడు ఈయన. తాజాగా మరోసారి అకీరా నందన్ లేటెస్ట్ ఫోటోస్ బయటికి వచ్చాయి.
తండ్రి పవన్ కల్యాణ్ తో కలిసి మ్యూజిక్ క్లాసులకు అటెండ్ అవుతున్నాడు అకీరా. అక్కడ తన తండ్రిని మించిపోయాడు అకీరా. కొడుకు భుజాల దగ్గరికి వచ్చాడు పవన్. ఆ హైట్ వెయిట్ చూసి తాము ఇంక వెయిట్ చేయలేం అంటున్నారు పవన్ అభిమానులు. త్వరగా అకీరా నందన్ ను లాంఛ్ చేసేయండి అంటున్నారు. ఈ ఫోటోలో పవన్ కూతురు ఆధ్య కూడా ఉంది. ఈ చిన్నారి కూడా ఇప్పుడు చాలా ఎదిగిపోయింది. మొన్నటి వరకు చిన్న పిల్లల్లా ఉన్న పవన్ బిడ్డలను చూసి ఇప్పుడు ఇంత ఎదిగిపోయారా అంటూ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. పవన్ అతడికి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు.. పేరు ఇచ్చాడు చాలు. రేపు ఫ్యూచర్ లో పవన్ కొడుకు అనే బ్రాండ్ తోనే అకీరా స్టార్ అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
ఇదిలా ఉంటే అకీరా నందన్ ఎప్పుడు సినిమాలు చేసినా కూడా తొలి సినిమాను మాత్రం రామ్ చరణ్ నిర్మిస్తాడనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. తమ్ముడి బాధ్యతలను తాను తీసుకోవాలని చూస్తున్నాడు చరణ్. అయితే తాజాగా బండ్ల గణేష్ పేరు కూడా తెరపైకి వచ్చింది. జూనియర్ పవర్ స్టార్ తొలి సినిమాను నిర్మించే అవకాశం బండ్లన్న కొట్టేసినట్లు టాక్స్ వినిపిస్తున్నాయి. పవన్, అకీరా ఉన్న ఫోటోను ట్వీట్ చేస్తూ నా దేవుడితో నా హీరో అంటూ బండ్ల గణేష్ రాసుకొచ్చాడు. అంటే బండ్ల గణేష్ ఈ ఆఫర్ అందుకున్నాడా అనిపించక మానదు. ఏదేమైనా కానీ మాయ చేయడంలో బండ్ల గణేష్ తర్వాతే ఎవరైనా..? నిజంగా అలాంటి మాయ చేసి అకీరా తొలి సినిమా ఆఫర్ కొట్టేసినా కొట్టేస్తాడు అంటున్నారు ఫ్యాన్స్.
నా దేవుడు తో నా హీరో @PawanKalyan pic.twitter.com/AblSazzyJQ
— BANDLA GANESH. (@ganeshbandla) May 31, 2021
ఇవి కూడా చదవండి..
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
KTR | ఒకే ఫ్రేమ్‌లో కేటీఆర్, సీఎం విజయ్, వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్!
Cab Driver: భార్యను, ఆమె బంధువుల్లో ఆరుగుర్ని కడతేర్చిన క్యాబ్ డ్రైవర్
Kothagudem | ప్రేమించడమే ఆమె చేసిన నేరం.. భార్యను హతమార్చిన ఏఆర్ కానిస్టేబుల్..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

