Akhil | అక్కినేని అఖిల్ మరి కొద్ది రోజులలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. గతంలో ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న అఖిల్ అనుకోని కారణాల వలన ఆమెకి బ్రేకప్ చెప్పాడు. ఇప్పుడు జైనబ్ రబ్జీ అనే యువతిని పెళ్లి చేసుకోనున్నాడు. వీరి పెళ్లికి సంబంధించి గత కొద్ది రోజులుగా అనేక ప్రచారాలు జరుగుతున్నా కూడా దానిపై క్లారిటీ అనేది రావడం లేదు. అయితే తాజాగా అఖిల్ తనకి కాబోయే భార్య జైనాబ్ రవ్జీతో కలిసి బీచ్ సైడ్‌లో ఓ ఫొటో దిగగా, ఈ పిక్ ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఈ పిక్‌పై నా సర్వస్వం అని రాసి ఉంది. ఇది అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఈ పిక్ చూసిన వారందరు కూడా జంటని తెగ పొగిడేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అఖిల్ పెళ్లి ఎప్పుడా అని అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటీవలి కాలంలో అఖిల్, జైనాబ్ తరచు బయట కనిపిస్తున్న నేపథ్యంలో వారిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని అంటున్నారు. ఇప్పుడు అఖిల్ వ్యక్తిగతంగా ఎంతో హ్యాపీగా కనిపిస్తున్నాడు. త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నాడు. అలానే ఓ మంచి సినిమా కూడా అఖిల్ ఖాతాలో పడితే మనోడికి ఇక తిరుగు ఉండదు. గత చిత్రం ‘ఏజెంట్’ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ లెనిన్ అనే టైటిల్‌తో ఓ కొత్త ప్రయోగాత్మక సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రానికి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ దర్శకత్వం వహించనున్నాడు. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక అఖిల్ చేసుకోబోయ్ అమ్మాయి జైనబ్ విషయానికి వస్తే.. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ . ఇండియాలోనే కాకుండా దుబాయ్ లండన్ లోను ఆర్టిస్ట్ గా ఆమెకు మంచి పేరు ఉంది. ఆమె వేసే పెయింటింగ్స్‌కి ఇంటర్నేషనల్ లెవల్ లో ప్రశంసలు కూడా దక్కాయి. జుల్ఫీ రావ్డ్జీ కుమార్తెనే జైనబ్. ఆయన రియల్ ఎస్టేట్ టైకూన్. నిర్మాణ పరిశ్రమలో ఆయనకు 30 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారుగా కూడా పనిచేశారు.