Akhil Next Movie | ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎనిమిదేళ్లవుతున్నా ఇప్పటివరకు కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయాడు అక్కినేని అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో తొలిహిట్ అందుకున్నా.. కమర్షియల్‌గా భారీ విజయం సాధించలేకపోయిడు. దాంతో రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఏజెంట్‌తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్‌కు ముందు చేసిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. తీరా రిలీజయ్యాక డిజాస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. పాత కథలనే రుబ్బి మళ్లీ చూపించాడనే మచ్చను సురేందర్ రెడ్డి తెచ్చుకున్నాడు. ఆయన స్టైల్ మేకింగ్ గానీ, విజన్ గానీ ఒక్క సీన్లోనూ కనిపించలేదు. ప్రేక్షకులనే కాదు.. అక్కినేని అభిమానులను సైతం ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.
ఇక ఆల్మోస్ట్ ఈ సినిమా పనైపోయింది. బ్రేక్ ఈవెన్ కోసం దాదాపు రూ. 40 కోట్లు సాధించాల్సి ఉండగా.. ఇప్పటివరకు పది కోట్ల షేర్ కూడా సాధించలేకపోయింది. ఈ సినిమా నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు కోట్లల్లో నష్టాలు తెచ్చిపెట్టింది. ఇక రెండేళ్లుగా ఒళ్లు హూనం చేసుకుని.. ఎంతో కష్టపడిన అఖిల్‌ను ఈ సినిమా ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సారి ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలనుకున్న అఖిల్ కల.. కలగానే మిగిలిపోయింది. ఇక ఇదిలా ఉంటే అఖిల్ తన కొత్త ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది.
కష్టపడటం మన చేతిలో ఉంది కానీ, ఫలితం మన చేతిలో లేదు అనే సిద్ధాంతాన్ని నమ్మి అఖిల్ తన కొత్త సినిమా కోసం ముస్తాబవుతున్నాడు. అఖిల్ తన తదుపరి సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్లో చేయనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయిపోయింది. సాహో సినిమాకు ఆసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనిల్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి షూటింగ్‌ను ప్రారంభించాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించనున్నట్లు సమాచారం.