అక్కినేని అఖిల్ మంచి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు అఖిల్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఈ సారైన మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం విడుదలకి సిద్ధం కాగా, బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వీలైనంత త్వరగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఏజెంట్
అనే సినిమా చేస్తుండగా, ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో అఖిల్ లుక్ ని డిఫరెంట్ గా ఎలివేట్ చేస్తున్నారు. అయితే అఖిల్ .. గుబురు గెడ్డం.. మీసకట్టు..హెవీ హెయిర్ తో కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ లుక్ గేమ్ ఆఫ్ థ్రోన్ లో కీలక పాత్ర ధారి అయిన జాన్ స్నోని పోలి ఉందని నెటి జనులు కామెంట్లు పెడుతున్నారు.
గేమ్ ఆఫ్ థ్రోన్
సిరీస్ వరల్డ్ వైడ్ గా ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అందులో జాన్ స్నో పాత్రకు… వేషాధారణకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సరిగ్గా అదే లుక్ లో ఇప్పుడు అఖిల్ కనిపంచడంతో అక్కినేని వారసుడ్ని ఆ సీనియర్ స్టార్ తో పోల్చేస్తున్నారు. ఏజెంట్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాన్నివీలైనంత త్వరగా పూర్తి చేయాలని సురేందర్ రెడ్డి భావిస్తున్నాడు.