బిగ్ బాస్ సీజన్ 4లో రొమాంటిక్ పెయిర్ ఎవరంటే అందరికి గుర్తొచ్చేది అఖిల్- మోనాల్ జంట. గత సీజన్స్‌లోను ఇలాంటి పెయిర్స్ ఉన్నప్పటికీ, వీరికి దక్కిన పాపులరాటీ మరెవరికి దక్కలేదు. హౌజ్‌లోనే కాకుండా బయటకు వచ్చాక కూడా తమ రిలేషన్ కొనసాగిస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు. తరచు పార్టీలు, ఫంక్షన్స్, ఈవెంట్స్‌లో కలిసి కనిపిస్తున్న ఈ జంట రీసెంట్గా తెలుగబ్బాయి-గుజరాతీ అమ్మాయి అనే వెబ్‌సిరీస్ చేయనున్నట్లు తెలిపారు.
ఇక అఖిల్ ఫస్ట్ టైం అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్న విషయాన్ని మేకర్స్ రీసెంట్గా ప్రకటించారు. ఇందులో హీరోయిన్గా మోనాల్‌ని కాకుండా కొత్త అమ్మాయి అనిక విక్రమన్ని ఎంపిక చేయడం పట్ల నెటిజన్స్ గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో అఖిల్ స్పందిస్తూ.. హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలనే ఛాయిస్ డైరెక్టర్‌దే. ఆయననే కొత్త హీరోయిన్ని ఎంపిక చేశారు. దాదాపు 27 స్క్రిప్ట్‌లు విన్న తర్వాత ఈ సినిమాను ఓకే చేశాను. సెప్టెంబర్‌లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని అఖిల్ స్పష్టం చేశాడు.