AkhilAkkineni | అక్కినేని అఖిల్ కథానాయకుడిగా మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’ చిత్రం నుండి తాజాగా ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న భాగ్యశ్రీ భోర్సె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమెకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె ‘భారతి’ అనే పాత్రలో నటిస్తుండగా.. తాజా పోస్టర్లో ఆమె మీసాలతో ఎంతో పద్ధతిగా కనిపిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.
అఖిల్ తన కెరీర్లో తొలిసారిగా చిత్తూరు నేపథ్యం ఉన్న ఒక రగ్గడ్ మాస్ పాత్రలో కనిపిస్తుండగా, భారతి పాత్ర అతని జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, జూన్ 26, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్ అందిస్తున్న ఈ సినిమా అఖిల్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Team #LENIN wishes the radiant and supremely talented #BhagyashriBorse a very Happy Birthday 🔥🔥
Just like she always does, Bharathi too is coming to mesmerize and conquer everyone with her magic ❤️#LeninOnJune26th @AkhilAkkineni8 @iamnagarjuna @vamsi84 @KishoreAbburu… pic.twitter.com/tzVqBKxQPP
— Sithara Entertainments (@SitharaEnts) May 6, 2026