అక్కినేని అఖిల్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఏజెంట్’. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ప్రస్తుతం వైజాగ్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘గూఢచారి థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అఖిల్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా నవ్యరీతిలో సాగుతుంది. వైజాగ్ పోర్ట్ ఏరియాలో చిత్రీకరిస్తున్న పోరాటఘట్టాలు సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయి’అని చిత్రబృందం పేర్కొంది. మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, సంగీతం: హిప్హాప్ తమిజా, నిర్మాణ సంస్థలు: ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా, కథ: వక్కంతం వంశీ, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.