‘ఏజెంట్’ తర్వాత కథల అన్వేషణలో పడ్డ అక్కినేని అఖిల్.. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరి చెప్పిన కథ దగ్గర లాక్ అయ్యారట. ఈ కథకు ఆ దర్శకుడు పెట్టుకున్న పేరు ‘లెనిన్’. ప్రస్తుతానికి అదే పేరును వర్కింగ్ టైటిల్‌గా చేసుకొని షూటింగ్ కానిచ్చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నదట. ఈ సినిమా కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని తెలుస్తున్నది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్లో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్నదని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.