Agent Trailer | టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్ (Agent). సురేందర్ రెడ్డి (Surenderreddy) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది అఖిల్ టీం. ప్రమోషన్స్ లో భాగంగా కాకినాడలోని ఎంసీ లారిన్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో ఏజెంట్ ట్రైలర్ ను లాంఛ్ చేశారు.
నువ్వు ఏజెంట్ ఎందుకు కావాలనుకుంటున్నావ్.. అని అఖిల్‌ను మమ్ముట్టి అడుగుతున్న సంభాషణలతో మొదలైంది ట్రైలర్. సింహం బోనులోకి వెళ్లి తిరిగొచ్చేది కోతి మాత్రమేనని మమ్ముట్టి అంటుండగా.. చేతిలో గన్ను, యాక్షన్, ఎమోషన్, ప్రతీ నిమిషం గూస్ బంప్సే కదా జీ అంటున్నాడు ఏజెంట్ అఖిల్. ఏజెంట్‌గా అఖిల్ స్టన్నింగ్ యాక్షన్ థ్రిల్లింగ్ అవతార్‌లో ఎంటర్టైన్ చేయబోతున్నాడంటూ ట్రైలర్‌తో చెప్పేశాడు డైరెక్టర్.
ఏజెంట్ ట్రైలర్..
ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏజెంట్‌తో మోడల్ సాక్షి వైద్య (Sakshi vaidya) తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్గా మెరువనుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏజెంట్ చిత్రానికి వక్కంతం వంశీ కథనందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
𝙇𝙞𝙜𝙝𝙩𝙨. 𝘾𝙖𝙢𝙚𝙧𝙖. &
Let’s bring in the #AGENT 𝘼𝙘𝙩𝙞𝙤𝙣!😎#AgentTrailer out now ❤️🔥
– https://t.co/8jnMq6zEclIN CINEMAS FROM APRIL 28th🔥#AGENTonApril28th@AkhilAkkineni8 @mammukka @sakshivaidya99 @DirSurender @hiphoptamizha @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/ckH2oavpVm
— AK Entertainments (@AKentsOfficial) April 18, 2023
ఏజెంట్ టీజర్..