Agnent Movie | అక్కినేని అభిమానులకు బ్యాడ్ న్యూస్.. అఖిల్ ‘ఏజెంట్’ వాయిదా పడనుందా?
అక్కినేని నట వారసుడు అఖిల్ కమర్షియల్ హిట్టు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి వరుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్‌కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కాస్త ఊరటనిచ్చింది. కానీ ఈ చిత్రం అఖిల్‌కు మాత్రం కమర్షియల్ హిట్టును ఇవ్వలేకపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాలని సురేందర్ రెడ్డితో చేతులు కలిపాడు. ప్రస్తుతం వీళ్ళ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏజెంట్’. అఖిల్ ఈ చిత్రం కోసం పూర్తీగా మేకోవర్ అయినట్లు గతంలో విడుదలైన పోస్టర్లను చూస్తే తెలుస్తుంది. కండలు తిరిగిన దేహంతో అఖిల్ ‘రా ఏజెంట్’గా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏజెంట్ చిత్రం విడుదల తేదీని వాయిదా వేసినట్లు తెలుస్తుంది.
ఈ చిత్రం విడుదల వాయిదా పడటానికి అనేక కారణాలే ఉన్నాయి. ఇటీవలే అఖిల్‌కు చిన్న గాయం కావడంతో షూటింగ్‌కు బ్రేక్ వచ్చింది. అంతేకాకుండా ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ప్రధానంగా ఉండటంతో షూటింగ్‌కు చాలా సమయం పడుతుంది. దాంతో చిత్ర బృందం విడుదలను వాయిదా వేసిందట. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

