టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు సురేందర్ రెడ్డి (Surenderreddy). ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఏజెంట్ (Agent). యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. మోడల్ సాక్షి వైద్య (Sakshi vaidya) హీరోయిన్గా నటిస్తోంది. కాగా సినిమా కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది.
తాజా అప్డేట్ ప్రకారం ఏజెంట్ టీం నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఈ నెల 15న మస్కట్‌కు బయలుదేరనుంది. 15 రోజులపాటు సాగే ఈ షెడ్యూల్లో యాక్షన్ పార్టును చిత్రీకరించనున్నారట. మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథనందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
ఏజెంట్ ఏప్రిల్ 28న థియేటర్లలో అన్ని ప్రధాన భారతీయ భాషల్లో సందడి చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ టీజర్, ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
ఏజెంట్ టీజర్..