Akhanda 2 | 600 మంది డ్యాన్సర్లతో ‘అఖండ’ మాస్ సాంగ్
Akhanda 2 | నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అఖండ 2’ (తాండవం).
Akhanda 2 | నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అఖండ 2’ (తాండవం). బ్లాక్ బస్టర్ సినిమా ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర యూనిట్ అనంతరం జార్జియాలో కూడా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. అయితే తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక ఎపిసోడ్లను చిత్రీకరిస్తుంది చిత్రయూనిట్. అయితే ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ షెడ్యూల్లో బాలకృష్ణతో బోయపాటి ఒక మాస్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దాదాపు 600 మంది డ్యాన్సర్ల ఈ సాంగ్‌లో బాలయ్యతో కలిసి డ్యాన్స్ చేయబోతున్నారు. భాను నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పకులు. సంయుక్త కథానాయికగా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

