Akhanda 2 Thaandavam | సౌండ్ కంట్రోల్లో పెట్టుకో.. ‘అఖండ 2: తాండవం’ నుంచి గ్లింప్స్ విడుదల!
Akhanda 2 Blasting Roar | నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘అఖండ 2: తాండవం’.
Akhanda 2 Blasting Roar | నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తూ శుక్రవారం దీనికి సంబంధించిన పవర్ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ముఖ్యంగా బాలకృష్ణ చెప్పిన డైలాగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. “సౌండ్ కంట్రోల్లో పెట్టుకో.. ఏ సౌండ్‌కి నవ్వుతానో.. ఏ సౌండ్‌కి నరుకుతానో నాకే తెలీదు కొడకా.. ఊహకు కూడా అందదూ…” అంటూ బాలయ్య తనదైన శైలిలో పవర్ఫుల్ వార్నింగ్ ఇవ్వడం గ్లింప్స్‌కే హైలైట్‌గా నిలిచింది.
యాక్షన్ మోడ్‌లో మొదలైన ఈ గ్లింప్స్‌లో వందలాది రౌడీల మధ్య ఒక్కడే నిలబడి ఉన్న బాలకృష్ణ.. వారిని ఒంటిచేత్తో మట్టికరిపిస్తున్న దృశ్యాలు ఆకట్టుకున్నాయి. గూండా నాయకుడికి వార్నింగ్ ఇస్తున్న సమయంలో, వెనుక నుంచి గుర్రాలతో అటాక్ చేయబోగా.. బాలయ్య ఒక్కసారిగా వెనక్కి తిరగడంతో గుర్రాలు బెదిరిపోయి వెనక్కి వెళ్లిపోవడం గ్లింప్స్‌కే ఊహించని మలుపు. బోయపాటి శ్రీను మేకింగ్ స్టైల్, ఆయన మార్క్ యాక్షన్, మరియు బాలయ్య వ్యక్తిత్వానికి అద్దం పట్టే డైలాగ్స్ అడుగడుగునా కనిపించాయి. ఇక ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (ఆర్.ఆర్) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సంగీతం ఈ గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఈ గ్లింప్స్‌లో బాలయ్య ‘అఖండ సికిందర్ అఘోరా’ గెటప్‌లో కాకుండా, సివిల్ గెటప్‌లో కనిపించారు. ఈ కొత్త లుక్‌ను కూడా ఫ్యాన్స్‌కి నచ్చేలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు బోయపాటి. ఈ గ్లింప్స్‌ను బట్టి బాలయ్య ఇందులో కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

