Akhanda 2 | నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ “అఖండ 2” కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా టైటిల్ అనౌన్స్మెంట్తోనే బజ్ పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ని మరింత పెంచేలా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వబోతోంది. సంగీత దర్శకుడు తమన్ స్వయంగా ఈ పాటపై భారీ హైప్ క్రియేట్ చేశాడు. ఆయన సోషల్ మీడియాలో రాసిన ప్రకారం .. “శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ కలిసి పాడిన ఈ సాంగ్‌ను వింటే నిద్రపట్టదు… ఆ ఎనర్జీ మనలో తాండవం చేస్తుంది! ఇది సాధారణ పాట కాదు, ఇది శివుడి శక్తి!” అంటూ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటేలా చేశాడు. ఈ సాంగ్ లాంచింగ్ కోసం ముంబైలోని జుహూలో ఉన్న పీవీఆర్ వేదికైంది. నవంబర్ 14న ఈవెంట్ ప్లాన్ చేశారు.
ఇప్పటికే సినిమా రిలీజ్దగ్గర పడడంతో టీమ్ ఇప్పుడు ప్రమోషన్ మోడ్‌లోకి వెళ్లింది. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ ప్రాజెక్ట్‌కు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ మార్కెట్లలో భారీగా బజ్ క్రియేట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇక “చికిరి చికిరి” పాటతో రామ్ చరణ్ సినిమా సోషల్ మీడియాలో ఎలా దుమ్మురేపిందో, అదే రేంజ్లో అఖండ 2 తాండవం సాంగ్ కూడా ఫైర్ లెవెల్ హిట్ అవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తమన్ మాటల ప్రకారం ఈ సాంగ్ అద్భుతంగా ఉంటే, అదే సినిమా ప్రమోషన్‌కి స్టార్ట్ పాయింట్ అవుతుందని సినీ వర్గాల టాక్.
సినిమా యూనిట్ టాక్ ప్రకారం “అఖండ 2 అవుట్‌పుట్ అద్భుతంగా ఉంది” అంటున్నారు. అయితే ఆ ఎమోషన్ ప్రేక్షకులకు రీచ్ కావాలంటే సరైన ఆల్బమ్, టీజర్, ట్రైలర్ సమయానికి రావడం కీలకం. అందుకే రాబోయే వారాల్లో బోయపాటి–బాలయ్య–తమన్ త్రయం ప్రమోషన్ రన్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని సమాచారం. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు రిలీజ్ ముందు రోజు స్పెషల్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారని టాక్. “ఓజీ” తరహాలో షోలు పెడితే హైప్ ఇంకా రెట్టింపు అవుతుందని యూనిట్ భావిస్తోంది.బాలయ్య ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఇప్పటికే “మాస్ ఈజ్ బ్యాక్”, “బోయపాటి ఫైర్ రిటర్న్స్” అంటూ ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నారు. “కేజీఎఫ్”, “పుష్ప”, “బాహుబలి”, “కాంతారా” లాంటి సీక్వెల్స్‌ను మించిపోయే స్థాయిలో “అఖండ 2” నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.